ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సీరియల్స్‌లో ఇలా.. 

Rajeev 

18 September 2024

కస్తూరి శంకర్‌.. ఒకప్పుడు సినిమాల్లో రాణించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. 

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా చేసి.. ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కస్తూరి

‘అన్నమయ్య’ సినిమాలో అక్కినేని నాగార్జున మరదలిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది కస్తూరి శంకర్‌.

బాలయ్య నిప్పురవ్వ, మోహన్‌బాబు సోగ్గాడి పెళ్లాం,రాజశేఖర్ మా ఆయన బంగారం, రథయాత్ర ఇలా చాలా సినిమాల్లో కనిపించింది. 

కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు సినిమాలో కమల్ చెల్లెలిగా నటించి మెప్పించింది కస్తూరి శంకర్. 

స్టార్ హీరోయిన్ గా రాణించిన ఆమె ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. గృహలక్ష్మి వంటి పలు హిట్‌ సీరియల్స్‌లో నటిస్తోందామె. 

సీరియల్స్ తోపాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.