అది అంతా నా ఇష్టం.. పూర్తిగా నా వ్యక్తిగతమే.: కరీనాకపూర్‌

Anil Kumar

09 August 2024

ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కరీనా కపూర్.. నటుడు సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్న కరీనా.. ఇప్పుడిప్పుడే సినిమాలతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటె తాజాగా తన సినిమాల సెలక్షన్ గురించి ఆమె స్వయంగా మాట్లాడిన క్లిప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సినిమా అంటేనే వినోదం అని.. అది ఎంటర్టైన్మెంట్ లేదా మెసేజ్ లానే చూడాలి అని అన్నారు హీరోయిన్ కరీనాకపూర్‌.

సినిమా ఇండస్ట్రీలో 10 నుంచి 15 కోట్ల పారితోషికం అందుకుంటున్న నాయికల్లో తాను ఒకరని అన్నారు కరీనాకపూర్‌.

అయితే అది కూడా కేవలం డబ్బు కోసమే సినిమాలు చేయనని చెప్పుకొచ్చారు. ఎక్కువ రెమ్యునరేషన్‌ అడిగిన అంత మాత్రాన..

ఆ సినిమాలో అయినా నటిస్తా అని కాదు.. పాత్ర నచ్చితే తక్కువ రెమ్యునరేషన్‌కి కూడా యాక్ట్ చేస్తానని చెప్పారు.

అయితే అది కూడా పూర్తిగా తన అభిప్రాయం మీదే ఆధారపడి ఉంటుందని క్లారిటీ గా చెప్పుకొచ్చారు హీరోయిన్ కరీనా.