TV9 Telugu
అలా చేస్తే పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తాయి..: కంగనా రనౌత్
07 March 2024
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. వివాదాలతో నిత్యం వార్తల్లో ఉంటుంది.
బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే అక్కడ యాక్టర్స్ పై కామెంట్స్ చేసే కంగనా.. ఇప్పుడు కంగనా మరో షాకింగ్ ప్రకటన చేసింది.
దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపలని కోరగా.. ఎప్పటిలాగే కొందరు కంగనాపై విమర్శలు చేస్తే మరికొందరు మద్దతుగా నిలిచారు.
కంగనా ఏ అంశంపైనైనా నేరుగా మాట్లాడుతుంది. తన ఆలోచనలను బహిరంగంగా పంచుకోవడం వల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
కంగనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.
‘డార్క్ వెబ్ విషయంలో కేంద్రం కూడా ఏదైనా చేయాలి. ప్రముఖుల డార్క్ వెబ్ నుంచి చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారు.
సెంట్రల్ డిటెక్షన్ పెరిగితే పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తుందని కంగనా ఇన్‌స్టా స్టేటస్ లో రాసుకొచ్చింది.
కంగనా రనౌత్ చేసిన ఈ కామెంట్స్ ను కొందరు సీరియస్ గా తీసుకుంటే మరికొంతమంది మాత్రం లైట్ తీసుకున్నరనే చెప్పాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి