కంగనా రనౌత్‌ ఎమర్జెన్సీ టైం.. డేట్ లాక్ చేసిన నటి.

Anil Kumar

28 June 2024

ఎన్నికల హడావిడి ముగిసింది.! గెలిచేసాం.. ఇక మళ్లీ ఇప్పడు సినిమాల మీద ఫోకస్ చేశారు హీరోయిన్ కంగనా రనౌత్‌.

బాలీవుడ్ కాంట్రవర్షియల్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ మరొకసారి ఫిలిం సర్కిల్స్‌లో ఈ విషయంపై ట్రెండ్ అవుతున్నారు.

నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న ఈ బ్యూటీ, తిరిగి ఫోకస్‌ను సినిమాల మీదకు షిఫ్ట్ చేశారు.

కంగనా రనౌత్‌ నటించి, డైరక్ట్ చేసిన సినిమా ఎమర్జెన్సీ.. ఈ సినిమా యొక్క రిలీజ్‌ డేట్‌ను కూడా లాక్ చేశారు.

బయోగ్రాఫికల్‌ అండ్ పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.!

ఎన్నో కారణాల వల్ల వాయిదా పడ్డ ఈ సినిమాను సెప్టెంబర్‌ 6న విడుదల చేయనున్నట్టు అధికారకంగా ప్రకటించారు కంగనా.

భారత ప్రజాస్వామిక చరిత్రలో మోస్ట్ కాంట్రవర్షియల్‌ ఎపిసోడ్‌ని ఈ సినిమాలో చూపించనున్నట్టు తెలిపారు కంగనా. 

అంతేకాదు ఆ తరువాత ఈ పొలిటిషన్ కం యాక్టర్ చేయబోయే సినిమాల విషయంలోనూ క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.