జిమ్‌కు వెళ్లకుండానే అందమైన ఫిట్నెస్.. కళ్యాణి ప్రియదర్శన్ డైట్ ఇదేనట
Rajitha Chanti
Pic credit - Instagram
ఇటీవలే కొత్త లోక చాప్టర్ 1 సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది కళ్యాణి ప్రియదర్శన్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 300 కోట్లు వసూలు చేసింది.
ఈ సినిమాలో సూపర్ పవర్స్ ఉండే హీరోయిన్గా కనిపించింది కళ్యాణి. గ్లామర్ బ్యూటీగా కనిపిస్తూనే యాక్షన్, ఫైట్ సీన్లతో అదరగొట్టింది కళ్యాణి ప్రియదర్శన్.
కళ్యాణి క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తుందట. బరువు పెరగకుండా శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుకునేందుకు ఇంట్లోనే ఉదయం లేదా సాయంత్రం వ్యాయమం చేస్తుందట.
అలాగే స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఫంక్షనల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తుంది. కోర్ స్ట్రెంగ్త్ పెంచుకునేలా కార్డియో చేస్తుందట. జిమ్ కు వెళ్లకుండా స్పోర్ట్స్ ఎక్కువగా ఆడుతుందట
ఎంత బిజీగా ఉన్నా ఉదయం బ్రేక్ ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయదట. పోషకాలు, ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహరం తీసుకోవడంతోపాటు హైడ్రేట్ గా ఉండేలా చూసుకుంటుదట.
మెటబాలీజంను మెరుగ్గా ఉంచుకునేందుకు హైడ్రేటెడ్‌గా ఉంటుందట. అందుకు రోజంతా పుష్కలంగా నీరు, జ్యూస్ లు, ఇతర పండ్లు తీసుకుంటానని అంటుంది.
పండ్లు, జ్యూస్ లు, నీరు, వర్కవుట్స్, గేమ్స్ తనను ఆమె ఫిట్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తాయని తెలిపింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం ఇంటి భోజనం చేస్తుందట.
జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడంతోపాటు ఇంట్లో కూరగాయలతో చేసిన పదార్థాలను మాత్రమే తీసుకుంటుదట. అలాగే రోజంతా అధికంగా నీరు తీసుకుంటుందట.