TV9 Telugu
తన ఫెవరెట్ హీరో ఎవరంటే.? కుండబద్దలు కొట్టిన కాజల్.
17 March 2024
హీరోయిన్లుని మీ ఫెవర్ హీరో ఎవరు అని అడిగితే.. ఆన్సర్ చెప్పి చెప్పనట్టు మాట దాటేసే ప్రయత్నం చేస్తుంటారు.
లేదా డిప్లొమేటిక్‌గా సమాధానాలు ఇచ్చేస్తుంటారు. హీరోల ఫ్యాన్స్‌తో లేని పోని తలనొప్పులు ఎందుకని దాటేస్తారు.
ఇదిలా ఉంటె ఇన్నాళ్లూ ఇదే చేసిన కాజల్ అగర్వాల్ తాజాగా తన ఫెవరెట్ హీరోస్ ఎవరనేది దానిపై క్లారిటీ ఇచ్చేసారు.
తాజాగా కాజల్ అగర్వాల్ కు సంబంధించిన ఈ వీడియోలో ఒక రిపోర్టర్ వైరల్ అయ్యే సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసాడు.
ఈ క్రమంలోనే నీ ఫెవరెట్ హీరో ఎవరని కాజల్‌ను అడగ్గా.. అందరూ నా ఫెవరెట్ హీరోలే అని చెప్పిన టాలీవుడ్ చంద్రమామ..
ఆ తర్వాత కుండ బద్దలుకొట్టినట్టు అసలు విషయం చెప్పారు. తనుకు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని..
తమిళ్లో ఇళయదళపతి విజయ్ అంటే ఇష్టమని చెప్పేశారు. దీంతో ఎన్టీఆర్ అండ్ దళపతి ఫ్యాన్స్ ఖుషి చేశారు కాజల్.
ఎట్ ది సేమ్ టైం రిమైనింగ్ హీరోస్ అభిమానుల నుంచి కాస్త చిన్నపాటి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు ఈ అమ్మడు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి