అందం కోసం ఆరాటపడితే.. చివరికి కళ్లే పోయాయి.!
Anil Kumar
23 July 2024
నయనాలు అందంగా కనిపించాలని ఆరాటపడిన బాలీవుడ్ బ్యూటీ "జాస్మిన్ బాసిన్"కు బిగ్ ఝలక్ తగిలింది అనే చెప్పాలి.
కాంటాక్ట్ లెన్స్‌తో.. అందంగా కనిపించొచ్చు అనుకుంటే.. ఏకంగా ఆమె కళ్లు పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు.
అందం కోసం.. అతిగా కాంటాక్ట్ లెన్స్ వాడే అలవాటు ఉన్న ఈమెకు.. ఇప్పుడు ఆ లెన్స్ కారణంగా కార్నియా దెబ్బతింది.
ఏకంగా చూపు కోల్పోయింది. దీంతో ఈమెను పరీక్షించిన వైద్యులు.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.
ఆమె చూపుని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై తాజాగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది జాస్మిన్ బాసిన్.
ఇదిలా ఉంటె.. పంజాబ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ ముందు సీరియల్స్ నుండి ఆ తరువాత సినిమాల్లో అడుగు పెట్టింది.
2011 లో వచ్చిన తమిళ చిత్రం 'వానం' తో వెండితెరకు పరిచయం అయ్యిన జాస్మిన్.. ఇప్పుడు వరస అవకాశాలతో అందుకుంటుంది.
సోషల్ మీడియాలో కూడా జాస్మిన్ బాసిన్ అందాలకి.. ఆమె ఫొటోస్ ఫాలోయింగ్ వేరే లెవల్ రేంజ్ లో సొంతం చేసుకుంది.
ఇక్కడ క్లిక్ చేయండి