24 July 2024
ఎన్టీఆర్‌తో డాన్స్ చేసేందుకు వెయిట్ చేస్తున్నా.. బాలీవుడ్ బ్యూటీ..
Rajitha Chanti
Pic credit - Instagram
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా దేవర. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది.
ఎన్టీఆర్ ఊరమాస్ అవతారంలో కనిపించనున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే జాన్వీ పల్లెటూరి అమ్మాయిల కనిపించనుంది.
ప్రస్తుతం ఊలఝ్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న జాన్వీ.. ఓ ఇంటర్వ్యూలో దేవర సినిమాతోపాటు ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, విక్కీ కౌశల్ వీరిలో ఎవరితో డాన్స్ చేయాలని ఉందని సదరు యాంకర్ జాన్వీని ప్రశ్నించగా రియాక్ట్ అయ్యింది.
తనకు ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్ చేయాలని ఉందని వెల్లడించింది. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నాను. తారక్‌తో కలిసి సాంగ్ షూటింగ్ పూర్తయింది.
తర్వాత పాటను ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. దేవర సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా.
పాన్ ఇండియా స్తాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు.
కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.