పొట్టిగా ఉన్నానని సినిమాల నుంచి తప్పించారు.. హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరోయిన్ ఆమె. 2012లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మాస్టర్స్ చిత్రంతో బాలనటిగా నటించింది.
2018లో బాలా దర్శకత్వం వహించిన నటసియార్ చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమలోకి కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆమె మరెవరో కాదండి ఇవానా.
తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే శ్రీవిష్ణు జోడిగా సింగిల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో వరుస ఆఫర్స్ వస్తాయని భావించారు. కానీ ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు ఈ ముద్దుగుమ్మ.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇవానా మాట్లాడుతూ.. తన హైట్ తక్కువ ఉండడం వల్ల చాలా సినిమా ఆఫర్స్ కోల్పోయానని.. ఎన్నో అవమానాలు పడినట్లు తెలిపింది.
అనేక చిత్రాలకు ఆడిషన్‌కు వెళ్లినప్పుడు తన హైట్ కారణంగా పలు సినిమాలకు తిరస్కరించారని.. అలాగే ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపింది.
తన హైట్ కేవలం 5 అడుగులు మాత్రమే అని.. అందుకే తాను హీరోయిన్ గా నటిస్తే బాగుండదు అని తన ముఖం మీదే నేరుగా చెప్పారని ఇవానా చెప్పుకొచ్చింది.
ఇవానా.. ఇప్పటివరకు హీరో, లవ్ టుడే, లెట్స్ గెట్ మ్యారీడ్, మదిమారన్, కల్వన్, డ్రాగన్ వంటి తమిళ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరలవుతున్నాయి.