హనీ పాప ఈజ్ బ్యాక్.. ఈ సారి పాన్ ఇండియా లెవల్లో అరాచకం.

Anil Kumar

23 June 2024

'హనీరోజ్'.. టాలీవుడ్ లో ఈ  అమ్మడు ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ళ హాట్ ఫెవరెట్ బ్యూటీ అయ్యిపోయింది.

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ప్రేక్షకుల నుండి యూత్ వరకు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో రెండు డిఫరెట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది ఈ వయ్యారి.

ఇందులో ఈ వయ్యారి క్యూట్ నెస్, అందంతోనే కాక.. తనదైన నటన అమాయకత్వం పరంగాను మంచి మార్కులు తెచ్చుకుంది హనీ.

అయితే ఈ సినిమా తర్వాత హనీ రోజ్ సినిమాలు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హనీరోజ్‌ లీడ్ రోల్‌లో నటించిన సినిమా రాహేలు.

హనీ రోజ్ మొదటిసారి పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ రాహేలు సినిమాకు ఆనందిని బాలా దర్శకతం వహించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటుంది.