ఈ నటిని గుర్తు పట్టారా? దేవ కన్యలా మెరిసిపోతూ..
TV9 Telugu
13 June 2024
అందమైన చీర కట్టుతో, ముక్కుకు ముక్కెర, స్టైలిష్ సన్ గ్లాసెస్‌తో మెరిసిపోతోన్న ఈ టాలీవుడ్ నటి కమ్ యాంకర్ ను గుర్తు పట్టారా?
ఈ అందాల తార మరెవరో కాదు హరి తేజ. గతంలో సినిమాలు, టీవీషోలతో బిజీ బిజీగా మారిపోయిందీ ఈ ముద్దుగుమ్మ.
ఇప్పుడు సోషల్ మీడియాలోనూ బిజీ బిజీగా ఉంటోన్న ఈ అందాల తార తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తోంది.
తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇందులో చీర కట్టుతో దేవకన్యలా మెరిసిపోయింది హరితేజ
మొదట ఈ ఫొటోలను చూసిన అభిమానులు ఆమెను గుర్తు పట్టలేకపోయారు .అయితే ఆ తర్వాత హరితేజ అని తెలసి ఆశ్చర్యపోయారు.
మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం, తాళి కట్టు శుభవేళ, శివరంజని, కన్యాదానం ఇలా పలు సీరియల్స్ లో నటించింది హరితేజ.
ఆతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన నితిన్, సమంతల అఆ సినిమాతో వెండితెర పై మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ లో తన ఆటతో పాటు అల్లరితో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..