అంత చిన్న వయస్సులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హన్సిక, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన మొదటి సినిమా దేశముదురు కి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.
దేశముదురు సినిమా సమయానికి నాకు 16 సంవత్సరాలు మాత్రమే నిండాయి, ఇంకా 17 వ సంవత్సరం లోకి కూడా అడుగుపెట్టలేదు.
కానీ నాకు అప్పటికీ నా సొంత డబ్బులతో కారు కొనుక్కోగలిగాను, ఇల్లు కట్టుకున్నాను’ అని చెప్పుకొచ్చింది.
ఇక దేశముదురు సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకుంటూ ‘ఈ సినిమాలో నాకు అవకాశం మెహర్ రమేష్ వల్లే వచ్చింది.
ఆయన లేకపోతే నా జీవితం ఈరోజు ఇలా ఉండేది కాదు, పూరి సార్ అప్పుడే తన సినిమాలో హీరోయిన్స్ కోసం కొత్తవాళ్ళని ఆడిషన్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు.
కానీ మెహర్ రమేష్ ఈ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్టుగా చాలా చక్కగా చేసింది సార్, మన సినిమాకి పెర్ఫెక్టుగా ఉంటుంది అని చెప్పారు.
అలా అనడం తో ఫోటో షూట్ చేసి వెంటనే తన సినిమాలో తీసేసుకున్నాడు’ అని చెప్పుకొచ్చింది హన్సిక.