అందం అమ్మయితే నీల ఉంటుందే.. అన్నట్టు ఫరియా అద్భుల్లా న్యూ క్లిక్స్..

Anil Kumar

02 September 2024

జాతిరత్నాలు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ ఫరియా అద్భుల్లా. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా ఫరియా అద్భుల్లా నటనతో.. అమాయకత్వంతో కుర్రకారుని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ వయ్యారి సినిమాల్లోకి రావడానికి ముందు హైదరాబాద్ లో థియేటర్ నటిగా పనిచేసింది. తర్వాత హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది.

నాగార్జున, నాగ చైతన్య హీరోగా నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో తన డాన్స్ తో మెప్పించింది ఫరియా.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రవితేజ హీరోగా వచ్చిన రావణాసుర సినిమా కూడా అమ్మడికి హిట్ ఇవ్వలేకపోయింది ఫరియా.

రీసెంట్ గా అల్లరి నరేష్ కు జోడోగా ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమా చేసింది. చివరికి ఈ సినిమా కూడా నిరాశపరిచింది.

ఒకే ఒక్క సూపర్ హిట్ సినిమా పడితే.. తన కెరీర్ ఊపందుకుంటుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది ఫరియా అద్భుల్లా.

ఇక సోషల్ మీడియాలో ఫరియా అద్భుల్లా ఫొటోస్ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఫొటోస్ పై మీరు ఒక లుక్కేయండి.!