TV9 Telugu
పెళ్ళికి రెడీ అయిన ఫరియా.! అప్పుడేనా అంటూ కామెంట్స్ వైరల్.?
15 March 2024
జాతిరత్నాలు మూవీతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన చిట్టీ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తుందా.?
అదేనండి హైదరాబాద్ నుండి వచ్చిన టాలీవుడ్ టాలెస్ట్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పెళ్లికి రెడీ అయిపోయింది అని టాక్.!
జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది హైదరాబాద్ కు చెందిన ఫరియా అబ్దుల్లా.
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు..
త్వరలోనే తన చిన్నపాటి మిత్రుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది అంటూ ఇండస్ట్రీ లో వినిపిస్తోంది.
ఇక్కడ మరో ఇంట్రుస్టింగ్ మేటర్ ఏంటంటే చిట్టీకి కాబోయే వరుడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడేనని టాక్.
ఇందులో నిజమెంతో తెలియదు కానీ అటు సోషల్ మీడియాలోను, ఇటు ఇండస్ట్రీలోనూ ఫరియా పెళ్లి హాట్ టాపిక్ గా మారింది.
కానీ దీనిపై ఫరియా నుండి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ఆ ఒక్కటి అడక్కు మూవీతో వస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి