30 November 2024

కాలేజీలో బాడీ షేమింగ్.. కట్ చేస్తే.. వయ్యారాలతో మెంటలెక్కిస్తోంది..

Rajitha Chanti

Pic credit - Instagram

ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. కానీ కాలేజీ రోజుల్లోనే బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొని బాధపడిందట ఈ ముద్దుగుమ్మ. 

ఆ విమర్శలు తనకు మానసికంగా ఒత్తిడికి గురిచేశాయని.. క్రమంగా తనను తాను అసహ్యించుకున్నానని గతంలో చెప్పుకొచ్చింది. 

ఇంతకీ ఆ వయ్యారి ఎవరంటే.. తనే దివ్యభారతి. కోయంబత్తూరులో జన్మించిన ఈ అమ్మడు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 

మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన దివ్య భారతికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. జివి ప్రకాష్‌ నటించిన బాచిలర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 

మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇందులో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 

ఇప్పుడు ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

కాలేజీలో తనను ఫాండా బాటిల్ సిస్టమ్, స్కెలిటన్, పెద్ద బట్ గర్ల్ పేర్లతో పిలిచేవారని.. ఆ మాటలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపింది. 

2015లో ఇన్‌స్టాగ్రామ్‌ లో నా ఫోటోస్ షేర్ చేశానని.. ప్రతి ఫోటోకు మంచి కామెంట్స్ వచ్చాయని.. మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉండే బాగుండేది అనిపించిందట.