21 November 2024

టాలీవుడ్‏లోకి క్రికెటర్ భార్య.. డ్యాన్స్ ఇరగదీస్తుందిగా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్యాన్సింగ్ క్వీన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. ఇప్పుడు ఈ బ్యూటీకి పోటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. 

తనే మోడల్ ధనశ్రీ వర్మ. ఇప్పటివరకు హిందీలోని రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలలో తనదైన ప్రతిభతో దుమ్మురేపింది ఈ వయ్యారి.

ఆమె మరెవరో కాదు యువ క్రికెటర్ చాహల్ భార్య. పెళ్లికి ముందే నటిగా, మోడల్ గా, డ్యాన్సర్ గా ప్రేక్షకులకు ధనశ్రీ సుపరిచితమే. 

డ్యాన్సింగ్ టాలెంట్ అద్భుతంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది. క్లారిటీ రాలేదు. 

 త్వరలోనే ప్రారంభం కానున్న ఓ భారీ బడ్జెట్ చిత్రంలో ధన శ్రీని ఎంపిక చేశారని టాక్. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. 

అందం, అభినయంతోపాటు డ్యాన్సులతోనూ మతిపోగొడుతుంది ధనశ్రీ. ఈ బ్యూటీ తెలుగులోకి ఎంట్రీ ఇస్తే సాయి పల్లవి, శ్రీలీలకు పోటీ అంటున్నారు

ప్రస్తుతం ధనశ్రీ డ్యాన్స్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ధనశ్రీ నటించబోయే సినిమాలో హీరో తెలియాల్సి ఉంది. 

సోషల్ మీడియాలో ధన శ్రీ చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ధనశ్రీ డాన్సింగ్ వీడియోస్ వైరలవుతున్నాయి.