పాపం చాందిని గట్టిగానే ఫీలైనట్టుంది.. ఎప్పటినుంచో చూస్తున్నా అంటూ..

Rajeev 

15 March 2024

షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ చాందిని చౌదరి. చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఆతర్వాత  కేటుగాడు సినిమాతో హీరోయిన్ గా మారింది.

ఈ సినిమా కంటే ముందు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసింది.

ఇక హీరోయిన్ గా మారిన తర్వాత వరుసగా  సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది.

ఇక సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమా ఈ చిన్నదాని క్రేజ్ ను డబుల్ చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఆతర్వాత క్రేజీ ఆఫర్స్ అందుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే రీసెంట్ గా విశ్వక్ సేన్ తో కలిసి గామి అనే సినిమా చేసింది.

ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా తిరుపతిలో మూవీ టీమ్ మీడియాతో మాట్లాడారు,. అయితే అక్కడ ఉన్నవారు హీరో, దర్శకుడిని మాత్రమే ప్రశ్నలు అడగటంతో చాందిని అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఎప్పటినుంచో చూస్తున్నా.. హీరోయిన్ ను ప్రశ్నలు అడగరు అంటూ తెగ ఫీల్ అయ్యిపోయింది ఈ అమ్మడు.