బచ్చన్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ 

rajeev 

29 AUG 2024

భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడీ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంతగా క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. 

చేసింది ఒక్క సినిమానే అయినా ఈ అమ్మడుకి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఎక్కడ చూసిన ఆమె పేరే 

మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది భాగ్యశ్రీ బోర్సే. 

ఈ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దాంతో భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది. 

మిస్టర్ బచ్చన్ రిజల్ట్ ఎలా ఉన్నా.. ఇప్పటికే పలువురు మేకర్స్‌ భాగ్యశ్రీ డేట్స్‌ కోసం క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. 

తాజాగా ఈ అమ్మడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని టాక్ వినిపిస్తుంది.