క్యూట్ క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్లను కవ్విస్తున్న క్రేజీ బ్యూటీ అయేషా ఖాన్..

29 August 2025

Rajeev 

చేసింది కొన్ని సినిమాలే కానీ కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్ అయిపొయింది అందాల భామ అయేషా ఖాన్.

ఈ అమ్మడు ముఖచిత్రం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేయలేదు.

కానీ చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఓం భీమ్‌ బుష్‌ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది.

విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సాంగ్ లోనూ తన అందాలతో కవ్వించింది అయేషా ఖాన్.

అలాగే శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమాలోనూ నటించింది. వీటితో పాటు హిందీ బిగ్ బాస్ లోనూ పాల్గొంది ఈ అమ్మడు.

బెంగాలీ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తెలుగులోనూ చిన్న చిన్న పాత్రలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ మెప్పిస్తుంది.

అలాగే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలకు యమా క్రేజ్ ఉంది. తన అందాలతో మతిపోగొడుతోంది అయేషా.