బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న  అనుపమ పరమేశ్వరన్ 

18 September 2025

Rajeev  

 ప్రేమమ్ సినిమాతో సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుపమ.. 2015లో స్టార్ స్టేటస్ అందుకుంది. 

తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుని ఈ బ్యూటీ రోజు రోజుకు మరింత పాపులర్ అయ్యింది. 

చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. కానీ అనుపమకు అనుకున్నంతగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

ఇప్పటివరకు అనేక హిట్ చిత్రాల్లో నటించిన అనుపమకు.. స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్స్ రాలేదు.

అనుపమ పరమేశ్వరన్ కేవలం 19 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ అయ్యింది. మలయాళ ‘ప్రేమమ్’ ఆమె జీవితాన్ని మార్చేసింది. 

మొన్నామధ్య పరదా అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా కిష్కిందాపురి సినిమాతో హిట్ అందుకుంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత అనుపమకు ఇప్పుడు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.