స్పీడ్ పెంచిన అంజలి.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. 

Rajeev 

08 JULY 2024

50కి పైగా చిత్రాల్లో  హీరోయిన్‌గా, ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించింది తెలుగమ్మాయి అంజలి.

కోలీవుడ్ హీరో జీవా సరసన డేర్ అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అంజలి.

ఆ తర్వాత 2006లో ఫోటో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు. 

ఆతర్వాత వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో అంజలికి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంది. 

ఇక తమిళ్ లో తెరకెక్కిన జర్నీ చిత్రంలో అంజలి తన నటనతో కట్టిపడేసింది. నిజానికి ఈ సినిమా తర్వాత అంజలి క్రేజ్ డబుల్ అయ్యింది. 

2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేశ్ సరసన అంజలి నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. 

ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేసింది అలాగే చరణ్ గేమ్ ఛేంజర్ లో నటిస్తుంది. వీటితో పాటు బహిష్కరణ అనే వెబ్ సిరీస్ చేస్తుంది అంజలి.