03 April 2024

పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అంజలి..  

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా గీతాంజలి. పదేళ్ల క్రితం సూపర్ హిట్ అయిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్. 

ఏప్రిల్ 11న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. చిత్రయూనిట్ పాల్గొంది. 

ఈ ఈవెంట్‏లో అంజలి మాట్లాడుతూ ఇటీవల తన పెళ్లిపై వస్తోన్న రూమర్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినిమా విషయాలు పంచుకుంది.

తనకు తెలియకుండానే ఇప్పటికే తనకు నాలుగుసార్లు పెళ్లి చేశారని తెలిపింది. ఇప్పుడు ఐదోసారి పెళ్లి చేస్తున్నారని చెప్పుకొచ్చింది అంజలి. 

సోషల్ మీడియాలో వస్తోన్న పెళ్లి రూమర్స్ గురించి తాను విన్నానని.. తాను పెళ్లి చేసుకుని వేరే ఇంట్లో ఉంటున్నట్లు రాశారని తెలిపింది. 

కానీ చాలా మందికి తెలియని విషయమేంటంటే తాను ఎక్కువగా అవుట్ డోర్ షూటింగ్స్‏లోనే ఉంటున్నానని.. ఇప్పుడు బిజీగా ఉన్నానని తెలిపింది.

అందుకే ఇప్పుడు వినిపిస్తున్న పెళ్లి వార్తలకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం అది ఫేక్ న్యూస్ అని.. పెళ్లైతే చేసుకుంటానని తెలిపింది. 

కానీ తన పెళ్లి మాత్రం ఇప్పుడు కాదని..అందుకు ఇంకా కొంచెం టైమ్ ఉందని అన్నారు. ప్రస్తుతం అంజలి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.