23 July 2024
రొమాంటిక్ సీన్స్ అందరిని బయటకు పంపించి షూట్ చేశారు.. అంజలి..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం చేతినిండా సినిమాలు, వెబ్ సిరీస్‌లో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ అంజలి. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది.
తాజాగా బహిష్కరణ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంజలి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంటిమేట్ సీన్స్ గురించి చెప్పుకొచ్చింది.
కెరీర్ ప్రారంభం నుంచి తనకు మంచి పాత్రలు వచ్చాయని.. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నట్లు తెలిపింది
ప్రతి ప్రాజెక్ట్ హోమ్ వర్క్ చేస్తానని.. కొన్ని మూవీస్ కోసం మార్షన్ ఆర్ట్స్ నేర్చుకున్నానని యాక్షన్ సీన్స్ డూప్ లేకుండా చేస్తానని తెలిపింది.
అలాగే నవరస సిరీస్ చేస్తున్నప్పుడు కాస్ట్యూమ్స్ కారణంగా కొన్ని గంటలపాటు వాష్ రూంకు కూడా వెళ్లలేదని చెప్పుకొచ్చింది అంజలి.
బహిష్కరణ వెబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సన్నివేశాలు చేసే సమయంలో అందరినీ బయటకు పంపించి వాటిని షూట్ చేశారని తెలిపింది అంజలి.
అయినా కానీ ఆ సీన్స్ చేసే సమయంలో కొంచం గందరగోళానికి గురయ్యానని.. ఇప్పటివరకు అలాంటివి చేయలేదని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి సినిమా అని.. తన పాత్రకు ఎంతవరకు న్యాయం చేయాలనేది తన చేతిలో ఉంటుందని.. సినిమా ఫలితం కాదని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి.