TV9 Telugu

03 January 2024

నా రూటే సపరేటు.! మరోసారి లొల్లి షురూ చేసిన అనసూయ.

అనసూయ.! సోషల్ మీడియా  సెన్సేషన్.! కాదు కాదు.. సోషల్ మీడియాకే సెంట్రాఫ్ అట్రాక్షన్.!

తన వీడియోలతో రీల్స్‌తో, యాక్టివిటీతో, ట్రోలర్స్‌కు మీమర్స్‌కు ఎప్పుడూ పనిచెప్పే ఈ బ్యూటీ న్యూ ఇయర్ వేళ మరో కాంట్రవర్సీకి కారణం అయ్యారు.

ఏదో సరదాకి చేసిన వీడియోతో మరో సారి ట్రోలర్స్‌ అండ్ మీమర్స్‌కు ఎయిమ్‌ అయ్యారు.

ఇక ఈ క్రమంలోనే అనసూయ కూడా ఓ వీడియోను తన ఇన్‌స్టా హ్యండిల్లో పోస్ట్ చేశారు.

కానీ ఆ వీడియోలో ఇన్‌స్టాలో పాపులర్ అయిన 'సావేజ్ అక్కయ్య' వర్జినల్ ఆడియోను వాడారు అనసూయ.

ఆ ఆడియోలో అక్కయ్య ఏం మాట్లాడుతుందో.. తన జోలికి వస్తే దూల తీర్చి దూప మేస్తా.. అంటూ.. వార్నింగ్ ఇస్తుంది.

ఇదే వాయిస్‌కు అనసూయ రీల్‌గా వాడడంతో.. ఇప్పుడా వీడియో మళ్లీ వైరల్ అయింది.

దీంతో రంగంలోకి దిగిన ట్రోలర్స్‌ మళ్లీ అనసూయను ఎయిమ్‌ చేస్తూ ఆ వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు.