TV9 Telugu
రొమాంటిక్ , బోల్డ్ సీన్స్ , హద్దలు దాటడం నటనలో భాగమే: అనన్య నాగళ్ళ.
07 March 2024
టాలీవుడ్ అందాల భామల్లో అనన్య నాగళ్ళ ఒకరు. మల్లేశం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ తెలుగమ్మాయి.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సబ్ సినిమాలో నటించింది.ఆ తర్వాత అనన్యకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి.
కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ లో కనిపించని అనన్య పొట్టేలు సినిమా ట్రైలర్ లో మాత్రం ఓ ముద్దు సీన్ లో కనిపించింది.
అంతే కాదు ఈసినిమాలో గ్లామర్ గేట్లు ఎత్తేసి బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయిందని టాక్ .. తాజాగా దీని పై అనన్య సమాధానమిచ్చారు.
పొట్టేలు సినిమాలో లానే.. తదుపరి సినిమాలోనూ ముద్దు సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటాయా అన్న ప్రశ్నకు అనన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
కథకు అవసరమైతే బోల్డ్ సీన్స్ లో నటిస్తానని చెప్పింది ఈ చిన్నది. తంత్ర సినిమాలోనూ రొమాంటిక్ , బోల్డ్, హారర్ ఉన్నాయని తెలిపింది.
అలాగే నేను మొదట్లో మంచి పాత్రలు వస్తేనే చేద్దాం అనుకున్నాను కానీ.. ఇవన్నీ నటనలో భగమే అని తెలుకున్నాను అని చెప్పింది అనన్య.
ఇక్కడ క్లిక్ చెయ్యండి