13 October 2024

నచ్చితే చేయండి.. ఎందుకింత నెగిటివిటీ ?.. అనన్య నాగళ్ల అసహనం.. 

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ప్రేక్షకులకు అనన్య నాగళ్ల సుపరిచితమే. 2019లో విడుదలైన మల్లేశం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యింది ఈ తెలుగమ్మాయి.

మొదటి సినిమాతోనే మంచి ఆదరణ సొంతం చేసుకున్న అనన్య... ఆ తర్వాత ప్లే బ్యాక్, వకీల్ సాబ్, శాకుంతలం, మళ్లీ పెళ్లి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఆమె నటించిన పొట్టేల్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 25న ఆ సినిమా విడుదల కానుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అనన్య.

తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియోకు వస్తోన్న విమర్శలపై నటి అనన్య నాగళ్ల స్పందించింది. ఎందుకింత నెగటివిటీ అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది ఈ బ్యూటీ. 

ప్లాస్టిక్ వాడకం తగ్గించమని ఇటీవల నేనొక వీడియో షేర్ చేశాను. దాన్ని కొందరు తప్పుబట్టారు. విమర్శలు చేశారు. చిన్న విషయం చెప్పాను. నచ్చితే చేయండి. 

లేకపోతే చేయకండి. కానీ ఎందుకింత నెగటివిటీ ? అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం అనన్య షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. 

ఇటీవల ఆమె స్ట్రా సాయం లేకుండా కొబ్బరిబొండాం నీళ్లు తాగుతూ కనిపించింది. స్టీల్ స్ట్రా వెంట తెచ్చుకుంటాను. అది లేకపోతే ఇలా కొబ్బరి నీళ్లు తాగుతాను.

ప్లాస్టిక్ వాడకాన్ని కాస్త తగ్గిద్దాం. చిన్న చిన్న పనులే పెద్ద మార్పులకు శ్రీకారం అంటూ వీడియో షేర్ చేయగా.. కొందరు విభిన్నంగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేశారు.