08 February 2025
రెమ్యునరేషన్ పెంచేసిన ఐశ్వర్య రాజేష్.. ఒక్క సినిమాకు ఎంతంటే
Rajitha Chanti
Pic credit - Instagram
పక్కా తెలుగమ్మాయి.. కానీ తమిళ్ సినీపరిశ్రమలో చాలా ఫేమస్. తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. సీనియర్ హీరో రాజేష్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది ఐశ్వర్య.
పేరుకే తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో కనిపించి నటిగా ప్రశంసుల అందుకుంది.
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తన తండ్రికి లెగసీని తెలుగులో కంటిన్యూ చేయాలనుకుంది. కానీ తెలుగులో అంతగా ఆఫర్స్ మాత్రం రావడం లేదు.
ఇప్పటివరకు దాదాపు 70 సినిమాల్లో నటించిన ఐశ్వర్యకు తమిళంలో స్టార్ డమ్ వచ్చేసింది. కానీ ఇప్పటికీ తెలుగులో మాత్రం సరైన బ్రేక్ రావడం లేదు.
రాజేంద్ర ప్రసాద్ నటించిన కౌశల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేసింది.
ఆ తర్వాత టక్ జగదీష్, రిపబ్లిక్ సినిమాల్లో మెరిసింది. ఇటీవలే వెంకటేశ్ జోడిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. తన రెమ్యునరేషన్ సైతం పెంచేసింది ఐశ్వర్య. ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.4 కోట్లు తీసుకుంటుందని సమాచారం.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్