25 May 2025

విశాల్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా.. ?

Rajitha Chanti

Pic credit - Instagram

కోలీవుడ్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. 

తమిళంతోపాటు తెలుగులోనూ ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడు విశాల్.

ఇక ఇటీవలే హీరోయిన్ సాయి ధన్సికతో తన పెళ్లి ఫిక్స్ అయినట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్ట్ 29 వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలిపారు. 

ఈ క్రమంలోనే ఇప్పుడు విశాల్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. హీరోగా, నిర్మాతగా రాణిస్తున్నారు విశాల్.

అలాగే ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు విశాల్. నివేదికల ప్రకారం విశాల్ ఆస్తులు రూ.25 కోట్లు అని టాక్. 

2013లో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ స్థాపించారు. ఈ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించారు. కానీ హిట్స్ కంటే ఎక్కువ ప్లాప్స్ చేశాడు. 

విశాల్ గ్యారేజీలో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పటికే ఆయన వద్ద 5 లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలసి చెన్నైలో ఉంటున్నాడు 

1977లో జన్మించిన విశాల్.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టారు. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.