06 June 2024
మిస్ యూ అంటోన్న హీరో సిద్ధార్థ్.. అసలేం జరిగిందంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఎవర్గ్రీన్ లవర్ బాయ్ సిద్ధార్థ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ అదితి రావ్ హైదరీతో ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది.
మహా సముద్రం సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు ఆ తర్వాత తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. ఇటీవలే తమ లవ్ స్టోరీ కూడా చెప్పుకొచ్చాడు.
మరోవైపు తిరిగి తన కెరీర్లో కూడా జోరు పెంచాడు సిద్ధార్థ్. గతేడాది చిన్నా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సిద్దూ కొత్త సినిమా ప్రకటించాడు.
ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో కీలకపాత్ర పోషించాడు సిద్ధార్థ్. తాజాగా తన లేటేస్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ కూడా షేర్ చేశాడు.
మిస్ యూ అనే టైటిల్‌తో కొత్త సినిమాను చేస్తున్నాడు సిద్ధార్థ్. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మాధవన్, శివకార్తికేయన్, డైరెక్ట్ లోకేష్ లాంచ్ చేశారు.
మరోసారి రొమాంటిక్ డ్రామాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు సిద్ధార్థ్. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.
కళతిల్ సంతిపోమ్ ఫేమ్ రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో నా సామిరంగ ఫేమ్ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది.
7 మైల్స్ పెర్ సెకండ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. చాలా కాలం తర్వాత రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు.
ఇక్కడ క్లిక్ చేయండి.