వీక్‌ మూమెంట్‌ లో చేసిన తప్పు.. అది నాకు బాగా నచ్చింది.: సన

సన పూర్తి పేరు షానూర్‌ సనా బేగం. సనా దాదాపు 200 చిత్రాలలో సహాయక పాత్రల్లో నటించింది.

సనకు టీనేజ్‌ లోనే వివాహం జరిగింది. ఆమె కుమారుడు సయ్యద్‌ అన్వర్‌ అహ్మద్‌ నిర్మాత.

ఇక సన కోడలు యాంకర్‌ సమీరా. పలు షోలకు సమీరా హోస్ట్‌ గా చేశారు.

దర్శకుడు కృష్ణ వంశీ తన 1996 చిత్రం నిన్నే పెళ్లాడతాలో సపోర్టింగ్‌ రోల్‌ తో పరిచయం అయ్యింది సన.

అయితే అలీ రెజా తో సన చేసిన రొమాన్స్‌ హాట్‌ టాపిక్‌ గా మారింది.

తాజాగా దీని పై స్పందించింది సన. ఆ రొమాంటిక్‌ సీన్‌ పై స్పందిస్తూ..

నేను ఆ రోల్‌ చేయడానికి కారణం డైరెక్టర్‌ కరుణ కుమార్‌, రైటర్‌ ఖదీర్‌ బాబు అని తెలిపింది సన.

'మెట్రో కథలు' సిరీస్లోలో నేను చేసిన స్టోరీలో మిడిల్‌ క్లాస్‌ మహిళ ఎంత స్ట్రగుల్‌ అవుతుందనేది చూపించారు.

ప్రస్తుతం సమాజంలో జరిగే వాటినే సిరీస్‌ లో చూపించారు ఆ పాత్రని చాలా నీట్లా ప్రెజెంట్‌ చేశారు అని చెప్పుకొచ్చారు సన.

ఆ సీన్‌ లో చిన్న వీక్‌ మూమెంట్లో చేసిన తప్పు అది. ఆ తప్పు నాకు నచ్చింది కాబట్టి ఒప్పుకొన్నాను. అన్నారు సన