ప్రౌడ్ మూమెంట్.. మేడమ్ టుస్సాడ్స్‌లో చరణ్ విగ్రహం.

Anil Kumar

17 July 2024

మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహం అంటే.. అదో గొప్ప విషయంగానే అందరూ ఫీలవుతుంటారు.! నిజమే కదా మరి..

అక్కడ మైనపు విగ్రహం పెట్టడం అంటే చాలా గొప్పగా మాట్లాడుకుంటారు.. అది ఒక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పొచ్చు.

అయితే ఈ గొప్ప మ్యూజియంలో ఇప్పుడు మన మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహం కూడా పెట్టబోతున్నారు.

ఇందుకోసం రీసెంట్‌గా మన స్టార్ హీరో రామ్‌ చరణ్‌.. లండన్ వెళ్లి తన బాడీ కొలతలను ఇచ్చినట్టు తెలుస్తోంది.

తొందర్లో అఫీషియల్ న్యూస్ కూడా.. చరణ్ నుంచి మెడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియం నుంచి బయటికి రాబోతున్నట్టు తెలుస్తోంది.

ఇంకేముంది సో మెగా ఫ్యాన్స్.. బీ రెడీ ఫర్ సెలబ్రేషన్స్‌ అంటున్నాయి సినిమా ఇండస్ట్రీ వర్గాలు. ఇదిలా ఉంటె..

ఇక ఆ మ్యూజియంలో ఏర్పాటు చేసే రామ్ చరణ్ మైనపు విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే..

చెర్రీ పెట్ రైమ్‌ను ఎత్తుకుని ఉన్న రామ్‌చరణ్‌ మైనపు బొమ్మనే మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేయనున్నారని టాక్.