ఆ సింగర్ తో ఎఫైర్ వల్లే జయం రవి విడాకులు తీసుకున్నాడా.?
Rajeev
21 September 2024
తమిళ నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే
తమిళ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు జయం రవి. తెలుగు సినిమాలను చాలా ఆయన తమిళ్ లో డబ్ చేశాడు.
ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సీనియర్ హీరో తన భార్య ఆర్తితో విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు.
జయం రవి పోస్ట్ తర్వాత చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆయన భార్య కూడా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రవి ఆ పోస్ట్ చేశాడు అని ఆరోపించింది.
ఇదిలా ఉంటే గాయని కెనిషా ఫ్రాన్సిస్‌తో ఎఫైర్ ఉంది అందుకే భార్యకు విడాకులు ఇచ్చాడు అంటూ వార్తలు పుట్టు
కొచ్చాయి.
విడాకుల సమస్యలోకి కెనీషా పేరును లాగవద్దని జయం
రవి
అభ్యర్థించాడు. బ్రతకనివ్వండి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు రవి.
ఇక్కడ క్లిక్ చేయండి