అర్జున్‌ ఇంట మొదలైన పెళ్లి సందడి.. ఫొటోలు వైరల్‌

June 10, 2024

TV9 Telugu

TV9 Telugu

యాక్షన్‌ కింగ్‌ హీరో అర్జున్‌ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె, నటి ఐశ్వర్య వివాహం నటుడు ఉమాపతి రామయ్యతో అతి త్వరలోనే జరగనుంది

TV9 Telugu

ఇందులో భాగంగా చెన్నైలోని అర్జున్‌ నివాసంలో హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి

TV9 Telugu

సంగీత్‌కు హాజరైన హీరో విశాల్‌.. అక్కడ దిగిన స్టిల్స్‌ను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అర్జున్‌ ఫ్యామిలీ తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు

TV9 Telugu

అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య వివాహం నటుడు ఉమాపతి రామయ్య తో జూన్‌ 10న చెన్నైలోని హనుమాన్‌ ఆలయంలో జరగనుంది. వీరిది లవ్‌ మ్యారేజ్‌. గతేడాది అక్టోబర్‌లో వీరి ఎంగేజ్‌ మెంట్‌ జరిగింది

TV9 Telugu

కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడే ఉమాపతి. అర్జున్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో ఉమాపతి పాల్గొన్నారు

TV9 Telugu

అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఉమాపతి, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య కూడా తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు 

TV9 Telugu

ఆమె హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఓ సినిమా ఖరారు కాగా అది తాత్కాలికంగా నిలిచిపోయింది. అర్జున్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది

TV9 Telugu

ఇక అర్జున్‌ కాబోయే అల్లుడు ఉమాపతి మనియార్..  కుటుంబం, తిరువనం, థానే వాడి, అడగప్పట్టత్తు మగజనంగళే లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు