అభినవ్ హీరోగా సినిమా.. మహేష్ తీపి జ్ఞాపకాలు..
TV9 Telugu
12 February 2024
తెలుగులో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ అభినవ్ గోమఠం.
ఈయన హీరోగా నటిస్తున్న సినిమా మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా..! ఈ చిత్రం ఫిబ్రవారి 23న విడుదల కానుంది ఈ సినిమా.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ వేడుక రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది.
యువ హీరో నిఖిల్ దీనికి ముఖ్య అతిథిగా వచ్చారు. వైశాలి రాజ్ ఇందులో కథానాయిక. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహిస్తున్నారు.
సోషల్ మీడియాను తక్కువగా ఉపయోగిస్తూ ఫోటోలు చాలా అరుదుగా షేర్ చేస్తుంటారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.
ఈ క్రమంలోనే తాజాగా భార్య నమ్రత శిరోద్కర్ తో ఉన్న ఫోటోలు షేర్ చేసారు. ఫిబ్రవరి 10న వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫోటోను షేర్ చేసారు.
నమ్రతకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతూ మహేష్ బాబు షేర్ చేసిన ఈ ఫోటో అందర్నీ ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం సిద్ధం అవుతున్న సూపర్ స్టార్. ఇది ఉగాది రోజున పట్టాలెక్కనుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి