కవ్వించే అందాలతో యట్రాక్ట్ చేస్తోన్న 'ఆత్మిక'..
19 September 2023
కోయింబత్తూరులో పుట్టి.. పెరిగిన 'ఆత్మిక'. చెన్నైలో డిగ్రీ పూర్తి చేసింది. నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
షార్ట్ ఫిల్మ్‌తో తన కెరీర్ ప్రారంభించిన 'ఆత్మిక'.. కాలేజీ చదివే రోజుల్లో పలు షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు ఒకట్రెండు మోడల్ అసైన్‌మెంట్స్ చేసింది.
అనంతరం 2017లో హిప్‌హాప్ తమిజ్హ ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ ఏడాదిలోనే 'మీసాయి మురుక్కు' చిత్రంతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది.
తొలి సినిమాతోనే తన నటనకు గానూ మంచి గుర్తింపు సంపాదించింది ఆత్మిక.. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లను దక్కించుకుంది.
చేసినవి 5 సినిమాలే అయినప్పటికీ.. 'మీసాయి మురుక్కు', 'కాట్టేరి', 'తిరువిన్ కురళ్' లాంటి హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేసే ఆత్మిక.. తన లేటెస్ట్ అప్‌డేట్స్, ఫోటోలతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది.
తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆత్మికను చూసిన నెటిజన్లు.. వరుసపెట్టి లవ్లీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
కాగా, ఆత్మికకు తెలుగులోనూ సినీ అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఇంకా ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి