ఆమిర్ నెక్ట్స్ మూవీపై క్లారిటీ..

13 October 2023

లాల్ సింగ్ చద్దా ఫెయిల్యూర్‌ ఆమిర్‌ ఖాన్‌ను బాగా డిస్ట్రబ్ చేసింది. భారీ ఆశలు పెట్టుకున్న సినిమాకు మినిమమ్ బజ్ కూడా రాకపోవటంతో డైలమాలో పడిపోయారు ఆమిర్‌.

దీంతో ముందు ఎనౌన్స్ చేసి ఛాంపియన్స్ రీమేక్‌ను కూడా పక్కన పెట్టేసి ఏం సినిమా చేయాలన్న విషయంలో సీరియస్‌గా ఫోకస్‌ పెట్టారు.

లాంగ్ గ్యాప్‌ తరువాత ఫైనల్‌గా నెక్ట్స్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు ఆమిర్ ఖాన్‌. తన కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిన సినిమాల్లో ఒకటైన తారే జమీన్‌ పర్‌కు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు.

అంతేకాదు ఆ సినిమాకు సితారే జమీన్‌ పర్‌ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్టుగా క్లారిటీ ఇచ్చారు. నెక్ట్స్ ఇయర్ జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తామని కన్ఫార్మ్ చేశారు.

ఆమిర్ ఖాన్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన తారే జమీన్ పర్ సినిమా ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఓ స్పెషల్ సినిమాగా పేరు తెచ్చుకుంది.

నటుడిగానే కాదు దర్శకుడిగానూ ఆమిర్ ఇమేజ్‌ను తారా స్థాయికి తీసుకెళ్లింది. అందుకే బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు మళ్లీ ఆ కాన్సెప్ట్‌నే నమ్ముకున్నారు ఆమిర్‌.

అయితే ఈ సినిమా తారే జమీన్‌ పర్‌కు సీక్వెల్‌గానే తెరకెక్కుతుందా, లేదంటే పూర్తిగా కొత్త లైన్‌లో రూపొందుతుందా..?

ఈ సినిమాను కూడా ఆమిర్ స్వయంగా డైరెక్ట్ చేస్తారా..? ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.