అడ్వంచరస్ ఆడు జీవితం ట్రైలర్.. మారుతి సీతారాం ట్రైలర్..

TV9 Telugu

11 March 2024

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న అడ్వంచరస్ థ్రిల్లర్ ఆడుజీవితం. ఇంగ్లీష్‌లో గోట్ లైఫ్ పేరుతో ఈ సినిమా విడుదల కానుంది.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఆడుజీవితం. తెలుగులో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

లక్ష్మణ్, భ్రమరాంబిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా సీతారాం సిత్రాలు. నాగ శశిధర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేసారు. పెళ్లి విసిఆర్ క్యాసెట్స్‌ నేపథ్యంలో ఈ సినిమా కథ వస్తుంది.

కొత్త కథ, కథనాలు ఉన్న సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతాయని ఈ సందర్భంగా తెలిపారు దర్శకుడు మారుతి.

బిగ్‌బాస్‌ ఫేం అర్జున్‌ అంబటి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్‌ రాపోలు ఈ సినిమాకు దర్శకుడు.

మహాశివరాత్రి సందర్భంగా చిత్ర టీజర్‌ను హీరో అల్లరి నరేష్‌ విడుదల చేసారు. అమ్మాయిల హత్యోదంతం నేపథ్యంలో టీజర్‌ ఉత్కంఠగా సాగింది.