ఆడుజీవితం... రికార్డు!
TV9 Telugu
14 April 2024
మలయాళీ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సినిమా తాజా చిత్రం 'ఆడుజీవితం'.ఇంగ్లీష్ లో ది గోట్ లైఫ్.
బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజువల్ రొమాన్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, ఆల్టా గ్లోబల్ మీడియా సంస్థలు నిర్మించాయి.
బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్ ఈ చిత్రానికి నిర్మాతలు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ లో పృథ్వీరాజ్ డిస్ట్రిబ్యూట్ చేసారు.
28 మార్చి 2024న మళయాళంతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదలైన ఈ చిత్రం బ్లక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
మలయాళంలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.
తాజాగా సీనియర్ నటుడు మోహన్‌లాల్ హీరోగా నటించిన 'లూసిఫర్' ఆల్‌టైమ్ కలెక్షన్లను దాటేసింది 'ఆడుజీవితం'.
ఇప్పటిదాకా మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్5 సినిమాల్లో స్థానాన్ని పదిలం చేసుకుంది ఈ చిత్రం.
ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమా కోసం భారీగా బరువు కూడా తగ్గారు వరదరాజా మన్నార్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి