'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ ని ఎంజాయ్ చేశానన్న హీరో..
TV9 Telugu
24 April 2024
అల్లరి నరేష్ హీరోగా ఫరియా అబ్దుల్లా కథానాయకిగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'.
మల్లి అంకం దర్శకత్వం వహించారు. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి సంయుక్తంగా నిర్మించారు.
వెన్నెల కిషోర్, జామీ లీవర్, హర్ష చెముడు మరియు అరియానా గ్లోరీ 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.
ఇక్కడ విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, సాంగ్స్, టీజర్ తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తాజాగా యూట్యూబ్ వేదికగా ఓ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. దీనిని ఓ హీరో మెచ్చుకున్నారు.
'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ ట్రైలర్ ని చాలా ఎంజాయ్ చేశానని అన్నారు టాలీవుడ్ సినిమా హీరో నాచురల్ స్టార్ నాని.
మూవీ కంటెంట్ అందరికీ రిలేట్ అయ్యేలా ప్రామెసింగ్ గా వుందని చెప్పారు. ఆయన చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది.
ఈ చిత్రం మే 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రొమోషన్స్ జోరు పెంచారు మూవీ మేకర్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి