ఆ ఒక్కటి అడక్కు డేట్ ఫిక్స్..
TV9 Telugu
17 April 2024
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమాకి అంకం మల్లి దర్శకత్వం వహించారు.
ఇందులో నరేష్‌కి జోడీగా జాతిరత్నాలు ఫరియా అబ్దుల్లా కథానాయకిగా నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కనిపించనున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. అదే మాత్రమే కాదు ఓ రొమాంటిక్ సాంగ్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్.
చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను మే 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
ఆ ఒక్కటి అడక్కు సినిమా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోందని గతంలోనే చెప్పింది చిత్రయూనిట్.
లీగల్ డ్రామా నాంది, యాక్షన్ థ్రిల్లర్ ఉగ్రం లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నరేష్ నటిస్తున్న కామెడీ చిత్రమిది.
సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో బచ్చల మల్లి అనే ఓ ఫ్యామిలీ డ్రామాలో కూడా హీరోగా నటిస్తున్నారు అల్లరి నరేష్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి