స‌త్య‌భామ‌, శర్వా మధ్య యుద్ధం.. గెలిచేది ఎవరు.?

TV9 Telugu

25 May 2024

కొంత గ్యాప్ తీసుకుని హీరో శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో న‌టిస్తున్న చిత్రం కామెడీ రొమాంటిక్ డ్రామా ‘మనమే’.

శ‌ర్వా 35వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శృతి శెట్టి కథానాయకిగా నటిస్తుంది.

విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, సుదర్శన్ ఇందులో కీలక పాత్రధారులు.

ఈ ఏడాది జూన్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్నట్లు తాజాగా ఈ చిత్ర బృందం వెల్లడించింది.

ఇదిలా ఉంటె అదే రోజు కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం స‌త్య భామ కూడా విడుదల కానుంది.

ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. నటుడు నవీన్ చంద్ర ఇందులో కీల‌క పాత్ర‌లో కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.

దీనితో పాటు మనమే నుంచి వచ్చిన టీజర్, పాటలు కూడా మెప్పించాయి. చూడాలి ఇక.. ఈ రెండింటీలో ఏది ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.