వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నయా వెబ్ సిరీస్..

16 October 2023

లేడీ విలన్ గా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది వరలక్ష్మి శరత్‌కుమార్‌. తెలుగు, తమిళ భాషల్లో హిట్ చిత్రాల్లో నటించింది.

సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ BA. BL చిత్రంలో లేడీ విలన్ గా తొలిసారి తెలుగు సినిమాలో కనిపించి ఆకట్టుకుంది.

తర్వాత రవితేజ బ్లాక్ బస్టర్ సినిమా క్రాక్ లో జయమ్మ పాత్రల్లో తనదైన నటనతో ప్రేక్షకులతో వావ్ అనిపించుకుంది.

తర్వాత కొన్ని తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల బాలయ్య వీరసింహరెడ్డి సినిమాతో ఆకట్టుకుంది.

ఇప్పుడు ఓ తెలుగు వెబ్ సిరీస్ తో డిజిటల్ లో కూడా అడుపెట్టనుంది టాలీవుడ్ లేడీ విలన్ వరలక్ష్మి శరత్‌కుమార్‌.

ఈమె ప్రధాన పాత్రలో ‘మాన్షన్‌ 24’ అనే అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ ఓటీటీ వేదికగా సందడి చేయనుంది.

ఈ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ కి ఓంకార్ దర్శకత్వం వహించారు. ఇది డీస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ సిరీస్ లో సత్యరాజ్‌, అవికా గోర్‌, బిందు మాధవి, నందు, రావు రమేష్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.