రాజ్‌తరుణ్ హీరోగా క్రైమ్ కామెడీ..
TV9 Telugu
14 April 2024
రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా తెలంగాణలోని హైదరాబాద్‌లో రామానాయుడు స్టూడియోస్‌లో మొదలైంది.
ఇందులో రాజ్ తరుణ్ సరసన కొత్త అమ్మాయి రాశి కథానాయకిగా నటిస్తుంది. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చనున్నారు.
ఈ నెల 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ నగరంలో మొదలవుతుందని తెలిపారు చిత్ర దర్శకనిర్మాతలు.
అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
క్రైమ్ కామెడీ కథతో తెరకెక్కిస్తున్నామని, తప్పకుండా అందరికీ ఆకట్టుకుంటుందని చెప్పారు ఈ మూవీ మేకర్స్.
రమేష్ కడుములు అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రమిది. తాజాగా జరిగిన పూజ కార్యక్రమానికి డైరెక్టర్ మారుతి ముఖ్య అథితిగా హాజరయ్యారు.
ప్రముఖ నిర్మాతలు ఎస్‌కెఎన్, నక్కిన త్రినాధరావు ఈ వేడుకకు విచ్చేసి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచారు.
ఈ క్రైమ్ కామెడీ సినిమా గురించి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు చిత్ర దర్శకనిర్మాతలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి