విజువల్ వండర్ కి భారీ సెట్‌.. చిరు కోసమే..

TV9 Telugu

23 May 2024

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వసిష్ఠ దర్శకత్వం వహిస్తున్న తెలుగు సోసియో ఫాంటసీ సినిమా విశ్వంభర.

యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాను చిరు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతుంది.

మెయిన్ హీరోయిన్‌గా త్రిష కృష్ణన్ ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు. అలాగే ఖుష్బూ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

స్టాలిన్ సినిమా తర్వాత త్రిష, ఖుష్బూ ఒకే సినిమాలో మరోసారి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటుండటం విశేషం.

ఇక ఇతర ప్రధాన పాత్రల్లో హీరోయిన్స్ ఇషా చావ్లా, అషికా రంగనాథ్, సురభి, మీనాక్షి చౌదరి, రమ్య  నటిస్తున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి ఓ లోకం నుంచి మరో లోకంలోకి వెళ్తారని.. ఈ విజువల్స్ అన్నీ అద్భుతంగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది.

విశ్వంభర సినిమాలో కీలక యాక్షన్‌ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ వేస్తున్నట్టు సమాచారం.

ఈ సీక్వెన్స్ లో చిరంజీవి, త్రిష పాల్గొంటారు. జూన్‌ రెండో వారం నుంచి ఈ యాక్షన్‌ సీక్వెన్స్ ప్రారంభిస్తారని టాక్‌.