18 September 2023
టైగర్ నాగేశ్వరరావు కథ ఎలాంటిదో తెలుసా? అందరూ కథలు కథలుగా చెప్పుకునేవారు.... అలాంటి వ్యక్తి బయోపిక్‌తో జనాల ముందుకొస్తున్నాను అంటున్నారు మాస్ మహరాజ్ రవితేజ.
ఈ ఏడాది ఈ హిట్ తనకు చాలా కీలకం అన్నది మాస్ మహరాజ్ చెబుతున్న మాట. ఇంతకీ టైగర్ నాగేశ్వరరావు రిజల్ట్ ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే మరి.
ఉన్నడేట్ నుంచి వాయిదాపడ్డ సినిమా సలార్. నయా డేట్‌ని మేకర్స్ అనౌన్స్ చేయకపోయినా, నవంబర్‌లో సలార్ తప్పక రిలీజ్ ఉంటుందనే మాట వినిపిస్తోంది .
వరుస ఫ్లాపుల్లో ఉన్న డార్లింగ్‌కి సలార్ అయినా ఊరటనిచ్చే సినిమా కావాలనేది రెబల్ సైన్యం నుంచి వినిపిస్తున్న కోరిక.
థియేటర్‌లో సక్సెస్ సౌండ్ వినాలనుకుంటున్నారు విక్టరీ వెంకటేష్. అందుకే ఈ సారి నయా సబ్జెక్ట్ సైంధవ్ తో డిసెంబర్‌లో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు.