శ్రుతి కి తోడుగా గీత.. బ్రేకప్ నుండి బయట పడేలా అభిమాని సలహా.!

Anil Kumar

26 June 2024

విశ్వనాయకుడు కమల్ హాసన్ నటవారసురాలిగా.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గుర్తింపు పొందింది శ్రుతి హాసన్.

తనదైన శైలితో తనకంటూ స్పెషల్ స్టార్ డమ్ సంపాదించుకుంది.. నటిగా, సింగర్ గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.\

తెలుగు, హిందీ, తమిళ భాషలలో స్టార్ హీరోలతో జతకట్టి సూపర్ హిట్స్ అందుకొని.. ఇప్పటికి అదే జోష్ లో కొనసావుతుంది.

ఎప్పుడూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటే ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా నే ఉంటుంది.

తాజాగా తన అభిమానులతో ముచ్చటించిన ఈ అమ్మడు.. తనకు ధూమపానం, మద్యపానం అలవాటు లేదని తెలిపింది శృతి హాసన్.

హుందాగా తన జీవితాన్ని గడుపుతున్నందుకు ఆనందంగా ఉందని.. ఇప్పటికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చింది.

తాజాగా లవ్‌ ఫెయిల్యూర్‌ నుంచి కోలుకోవడానికి భగవద్గీత చదవమని ఓ నెటిజన్‌ ఇచ్చిన సలహాకు స్పందించారు శ్రుతి.

తాను డిప్రెషన్‌లో లేనని.. భగవద్గీతను ఆమె ఎప్పుడూ చదువుతూ ఉంటానని.. సలహా ఇచ్చినదుకు థాంక్యూ చెప్పారు.