ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లుతో ఓ క్రేజీ ప్రాజెక్ట్..
07 October 2023
తూఫాన్ అనే సినిమాతో నటుడిగా సూపర్ హిట్ అందుకున్న ఫర్హాన్... దర్శకుడిగానూ మరో బిగ్ హిట్ మీద కన్నేశారు.
డైరెక్టర్‌గా తనకు బిగ్ హిట్ ఇచ్చిన దిల్ చహతా ఫ్లేవర్‌లోనే మరో మూవీని ప్లాన్ చేశారు. ఈ సారి ముగ్గురు హీరోయిన్లతో లేడీ మల్టీ స్టారర్ జీలే జరాను గ్రాండ్‌గా ఎనౌన్స్ చేశారు.
దిల్ చహతా హై సినిమాలో అప్పుడు ఫుల్ ఫామ్‌లో ఆమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటించారు. అందుకే ఫీమేల్ వర్షన్‌కు ప్రజెంట్ టాప్ ఫామ్‌లో ఉన్న బ్యూటీస్‌ను పిక్ చేసుకున్నారు.
క్యూటీ లేడీ అలియా భట్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, యాక్షన్ బ్యూటీ కత్రినా కైఫ్, ఈ సినిమా కోసం ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారంటూ ఆడియన్స్‌లో అంచనాలు పెంచేశారు.
ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయి చాలా కాలం అవుతున్నా.. ఇంతవరకు పట్టాలెక్కలేదు. ఈ లోగా పరిస్థితులు మారిపోయాయి. ముగ్గురు హీరోయిన్లు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్స్‌లో ఫుల్ బిజీ అయ్యారు.
దీంతో ఈ ప్రాజెక్ట్‌కు డేట్స్ అడ్జస్ట్ చేయటం కష్టంగా మారింది. ఈ కారణాలతో ఈ బ్యూటీస్ జీలే జరా నుంచి తప్పుకోవాలని ఫిక్స్ అయ్యారు.
అయితే ఫస్ట్ నుంచి ప్రియాంక, అలియా, కత్రినాలను దృష్టిలో పెట్టుకొని కథ సిద్ధం చేసిన ఫర్హాన్, వాళ్లు నో అంటూ ప్రాజెక్ట్ పక్కన పెట్టేయాలని ఫిక్స్ అయ్యారు.
అందుకే ప్రస్తుతానికి ఈ సినిమాను హోల్డ్‌లో పెట్టేసి, ఫ్యూచర్‌లో డేట్స్ అడ్జస్ట్ అయితే రీ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు.