ఈ ఏడాది ప్రతి పండగ ఈ బ్యూటీదే.. ఒకే నెలలో 3 చిత్రాలతో మీనాక్షి.. 

Battula Prudvi

26 October 2024

ఈ ఏడాది వరుస సినిమాలతో సినీప్రియులు చేస్తూ మురిపించే ప్రయత్నం చేస్తూ బిజీగా మారిపోయింది మీనాక్షి చౌదరి.

సంక్రాంతి బరిలో మహేష్ సరసన ‘గుంటూరు కారం’తో సందడి చేసిన ఈ భామ.. వినాయక చవితికి ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’తో వినోదాలు పంచింది.

మళ్లీ దీపావళికి కూడా ‘లక్కీ భాస్కర్‌’తో దుల్కర్‌ సల్మాన్‌ సరసన సందడి చేసేందుకు సిద్ధమైంది ఈ ముద్దగుమ్మ.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్టోబర్ 31న రానున్న ఈ సినిమాలో దుల్కర్‌ భార్యగా సుమతి పాత్రలో కనువిందు చేయనుంది.

వరుణ్‌ తేజ్‌ హీరోగా దర్శకుడు కరుణ కుమార్‌ తెరకెక్కించిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘మట్కా’లో మీనాక్షి గృహిణి పాత్రలోనే కనువిందు చేయనుంది.

ఇది పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా చిత్రంగా నవంబరు 14న చిల్డ్రన్స్ డే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది.

తర్వాత వారం గ్యాప్‎లోనే నవంబరు 22న ‘మెకానిక్‌ రాకీ’తో సొగసుల పటాకా పేల్చేందుకు సిద్ధమవుతోంది ఈ వయ్యారి.

విశ్వక్‎సేన్‎కి జోడిగా మోడ్రన్‌ అమ్మాయిగా స్టైలిష్‌ పాత్రలో ఆకట్టుకోనుంది. ఈ 3 చిత్రాలతో మీనాక్షి హ్యాట్రిక్‌ విజయాలు ఖాతాలో వేసుకొంటుందా? చుడాలిక..