రూ.202తో 13 ఓటీటీలు.. వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్లాన్‌

21 December 2023

TV9 Telugu

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (వీఐ) స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చింది.

తమ కస్టమర్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడమే లక్ష్యంగా వొడాఫోన్‌ ఐడియా రూ.202 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

‘వీఐ మూవీస్‌ అండ్ టీవీ’ పేరిట వొడాఫోన్‌ ఐడియా (వీఐ) ఇప్పటికే వినియోగదారులకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తోంది.

తాజాగా వీఐ తీసుకొచ్చిన కొత్త ప్లాన్‌తో ‘వీఐ మూవీస్‌ అండ్‌ టీవీ ప్రో’ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

కొత్తగా తీసుకొచ్చిన రూ.202 ప్లాన్‌లో వొడాఫోన్‌ ఐడియా 13కు పైగా ఓటీటీలతో కూడిన ‘వీఐ మూవీస్‌ అండ్‌ టీవీ ప్రో’ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

ఈ ప్లాన్‌తో లభించే ఓటీటీ సర్వీస్‌లు ఏంటనేది మాత్రం వోడాఫోన్ ఐడియా (వీఐ) సంస్థ ప్రత్యేకంగా వివరించలేదు.

కానీ, ‘వీఐ మూవీస్‌ అండ్‌ టీవీ ప్రో’లో సోనీలివ్‌, జీ5, డిస్నీ+ హాట్‌స్టార్‌, సన్‌నెక్ట్స్‌, హంగామా, షెమారూమీ వంటి ప్రముఖ ఓటీటీలు ఉంటాయి.

ఈ ప్లాన్‌లో వీటన్నింటినీ ఒక నెల పాటు ఎంజాయ్‌ చేయొచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో వాయిస్‌ కాలింగ్‌, డేటా వంటి ఇతర ఎలాంటి ప్రయోజనాలు లేకపోవడం గమనార్హం.