ఓటీటీలో రికార్డులు శృతిస్తున్న 12th ఫెయిల్.. ఊరిపేరు భైరవకోన రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

TV9 Telugu

13 January 2024

ఓటీటీ రిలీజ్‌ తరువాత రికార్డ్‌లు సృష్టిస్తోంది బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ మూవీ 12th ఫెయిల్.

థియేట్రికల్‌ రిలీజ్‌లో పాజిటివ్‌ టాక్‌ వినిపించినా భారీ వసూళ్లు సాధించలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం రికార్డ్ వ్యూస్‌ సాధిస్తోంది.

తాజాగా ఐఎండీబీ రేటింగ్స్‌లోనూ సత్తా చాటింది ఈ చిన్న సినిమా. హాలీవుడ్‌ సూపర్ హిట్స్‌ను సైతం వెనక్కి నెట్టి 9.2 రేటింగ్‌తో టాప్‌లో నిలిచింది.

ఇటీవల రిలీజ్ చేసిన 265 చిత్రాల జాబితాలో మలయాళ మూవీ 2018తో పాటు బాలీవుడ్ మూవీ 12th ఫెయిల్‌కు ఆస్కార్ రేసులో చోటు దక్కింది.

ఈ పోటికి సంబంధించి జనవరి 23న ఫైనల్‌ షార్ట్‌ లిస్ట్ వెల్లడికానుంది. తుది పోటిలో నిలిచే 10 చిత్రాలను ఆ రోజు ప్రకటించనుంది అకాడమి జ్యూరి.

సందీప్‌ కిషన్‌ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ డ్రామా ఊరిపేరు భైరవకోన. వర్ష బొల్లమా హీరోయిన్‌.

ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా గతంలోనే వెల్లడించింది చిత్రయూనిట్‌.

తాజాగా మరోసారి అదే డేట్‌కు సినిమా రాబోతుందని క్లారిటీ ఇచ్చింది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తుంది.